నాన్‌షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి
ABN , First Publish Date - 2020-12-02T05:28:46+05:30 IST
నాన్‌షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు.
రాస్తారోకోలో సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్
పాడేరురూరల్, డిసెంబరు 1: నాన్‌షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. నాన్‌షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, డుంబ్రిగుడ మండలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర, బి.చిన్నయ్యపడాల్, డి.గంగరాజు, బి.సన్నిబాబు, ఎల్.సుందరరావు పాల్గొన్నారు.