రైతు వ్యతిరేక బిల్లులు వ్యతిరేకించాలి: సీపీఎం

ABN , First Publish Date - 2020-11-16T04:15:43+05:30 IST

కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేరించాలంటూ సీపీఏం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆదివారం కరపత్రాలను పంపిణీ చేశారు.

రైతు వ్యతిరేక బిల్లులు వ్యతిరేకించాలి: సీపీఎం
రోలుగంటలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

రోలుగుంట, నవంబరు 15: కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక  బిల్లులను  వ్యతిరేరించాలంటూ సీపీఏం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆదివారం కరపత్రాలను పంపిణీ చేశారు.  పార్టీ నేత ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఈ బిల్లులు దళారులకే లాభం చేకూర్చేలా ఉన్నాయన్నారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు బిల్లుకు మద్దతు ఇచ్చారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,  రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటానికే  26న సార్వత్రిక సమ్మెను చేపడుతున్నామని, దానిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒనుం శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-16T04:15:43+05:30 IST