గిరిజనుల గుండె చప్పుడు మేకా సూరిబాబు

ABN , First Publish Date - 2020-11-27T06:08:54+05:30 IST

సీపీఐ నేత మేకా సూరిబాబు 33వ వర్థంతిని గురువారం పాతకృష్ణాదేవిపేటలో నిర్వహించారు.

గిరిజనుల గుండె చప్పుడు మేకా సూరిబాబు

 వర్ధంతి సభలో వివిధ సంఘాల ప్రతినిధులు 

కృష్ణాదేవిపేట, నవంబరు 26 : సీపీఐ నేత మేకా సూరిబాబు 33వ వర్థంతిని గురువారం పాతకృష్ణాదేవిపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి  పొట్టిక సత్యనారాయణ  మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలోని పలు మండలాల్లో గిరిజనుల హక్కుల సాధనకు  నిరంతరం పోరాటం చేసిన యోధుడు సూరిబాబుగా పేర్కొన్నారు. తొలుత గ్రామ శివారులో ఉన్న స్మారక స్థూపం వద్ద గల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంతా నివాళులర్పించారు.  రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేకా సత్యనారాయణ,  సీపీఐ నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, గురుబాబు, కొండలరావు, రామారావు, భాస్కరరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Read more