-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » covid problems
-
కొవిడ్ సమస్యలు కోకొల్లలు
ABN , First Publish Date - 2020-12-06T06:21:24+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కోట్లాది మంది ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఇంకొంతమంది శారీరకంగా, మానసికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

నెలల తరబడి ఇళ్లల్లోనే ఉండడంతో శారీరక, మానసిక రుగ్మతలు
మహిళలు, పిల్లల్లో ఊబకాయం
వృద్ధులకు కీళ్లవాతం
ఆన్‌లైన్ తరగతులతో ిల్లల్లో ఇరిటేషన్, ఓవర్ రియాక్షన్, ళ్ల సంబంధిత సమస్యలు
కొందరిలో నిద్రలేమి, ుండె దడ, ఆందోళన
15 శాతం నుంచి 20-25 శాతానికి పెరిగిన డిప్రెషన్ సమస్య
కుటుంబాల్లోను గొడవలు
సానుకూల దృక్పథాన్ని లవరచుకోవాలంటున్న వైద్యులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కోట్లాది మంది ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఇంకొంతమంది శారీరకంగా, మానసికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంకా ఎన్నాళ్లీ ఇబ్బందులుంటాయో?, ఎప్పటికి సాధారణ రోజులు వస్తాయో?, జీవన పరిస్థితులు ఎప్పటికి మెరుగుపడతాయో..? అన్న ఆందోళన, అభద్రతా భావం ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి తరువాత రోజుల తరబడి ఇళ్లలో వుండడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
డిప్రెషన్
గతంలో 12-15 శాతం మంది ప్రజల్లో మాత్రమే కనిపించే కుంగుబాటు (డిప్రెషన్) కరోనా వచ్చిన తరువాత 20-25 శాతానికి పెరిగిందని మానసిక వైద్యులు చెబుతున్నారు. అనేక సంస్థలు ఉద్యోగాల్లో కోత విధించడం, జీతాలు తగ్గించడం వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, వైరస్ సోకుతుందేమోనన్న భయం, పరిస్థితులు ఎప్పటికి కుదురుకుంటాయోననే ఆందోళన డిప్రెషన్‌కు కారణమంటున్నారు. భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, రోజుల తరబడి ఇళ్లల్లో వుండాల్సి రావడం వంటివి ఈ సమస్య పెరిగేందుకు దోహదం చేసినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నెలల తరబడి ఇళ్లలోనే వుంటున్న మహిళలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు.
ఇళ్లకే పరిమితం కావడం వల్ల..
వైరస్ సోకుతుందేమోనన్న భయంతో ఇప్పటికీ వృద్ధులు, చిన్నారులు, మహిళలు స్వేచ్ఛగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పది మందితో కలిసే అవకాశం లేకపోవడం వల్ల చాలామందిలో ఇరిటేషన్, గుండె దడ, సరిగా నిద్ర పట్టకపోవడం, ఆందోళన, భయం వంటి సమస్యలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఉదయం నుంచి రాత్రి వరకు ఇళ్లలో కూర్చుని వుండడం వల్ల మహిళలు, పిల్లల్లో ఒబెసిటీ సమస్య కూడా కనిపిస్తోందని, వృద్ధుల్లో కీళ్ల సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్ తరగతులతోనూ...
కంటి సంబంధిత సమస్యలతోపాటు పిల్లల్లో మాన సిక కుంగుబాటుకు ఆన్‌లైన్ తరగతులు కారణమవు తున్నట్టు నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా శారీరక శ్రమ కలిగించే ఆటలు లేకపోవడం, స్నేహితులను కలిసేందుకు అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల పిల్లల్లో ఒత్తిడి, యాంగ్జయిటీ, అయోమయం వంటివి కనిపిస్తున్నాయంటున్నారు. అదే కాలేజీ విద్యార్థుల్లో అయితే ఓవర్‌గా రియాక్ట్ కావడం, అసహనం వంటివి పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
పరిష్కార మార్గాలు
కరోనా వైరస్ పట్ల భయాన్ని వీడి..సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు వుండవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరస్‌కు కొద్దిరోజుల్లోనే వ్యాక్సిన్ వస్తున్న నేపథ్యంలో అప్పటివరకూ జాగ్రత్తగా వుంటే సరిపోతుందంటున్నారు. ర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించాలి. ఉద్యోగం లేదని ఇంట్లోనే రోజుల తరబడి కూర్చోవడం కంటే..గతంలో కంటే తక్కువ జీతమైనా ఏదైనా దొరుకుతుందేమో చూడాలి. సరైనా ఉద్యోగం దొరికేంత వరకు ప్రత్యామ్నాయ పనులు చేయడంపై దృష్టిసారించాలి.
గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. ఈ సమయాన్ని ఎవరికి వాళ్లు నచ్చినట్టుగా గడపడం కంటే...అందరూ కలిసి సంతోషంగా వుండేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో ఎక్కువ సమయాన్ని గడపాలి.
మహిళలు, వృద్ధులు...స్నేహితులతో ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం వల్ల చాలావరకు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అవకాశముంది. రోజులో కొంత సమయమైనా స్నేహితులు, బంధువులతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వృద్ధులు మేడపైన, ఇంట్లోనే కొంత సమయం వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు బారినపడకుండా ఉండవచ్చు. ్రతిరోజూ కొంత సమయం మేడపైకి వెళ్లి ఎండలో కూర్చోవడం ద్వారా కొంత రిలాక్సేషన్ పొందవచ్చు. వీలైతే యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. పిల్లలతో కొంతసేపు షటిల్ వంటి ఆటలను ఆడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ు రోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గిన నేపథ్యంలో వారాంతంలో ఒక్కసారైనా తగిన జాగ్రత్తలు (సామాజిక దూరం, మాస్క్) తీసుకుంటూ బయటకు వెళ్లి రావడం ద్వారా కాస్త ఉపశమనం పొందవచ్చు. తద్వారా ఇంట్లోనే వుండడం వల్ల కలిగే తాను ఒంటరిని అన్న భావనను కొంతవరకు తగ్గించుకునేందుకు అవకాశముంది.
ఆర్థిక ఇబ్బందులే సగం సమస్యలకు మూలం
- డాక్టర్ రామనరసింహ, ప్రముఖ వైద్య నిపుణులు
ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న వారంతా కరోనా వల్ల రోడ్డునపడ్డారు. ఉద్యోగాలు లేక, చాలీచాలని జీతాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులే సగం మానసిక సమస్యలకు మూలం. ఆన్‌లైన్ తరగతులు, స్నేహితులతో కలిసే అవకాశం లేకపోవడం వల్ల పిల్లల్లోనూ పలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సానుకూల దృక్పథంతో ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు యత్నించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి.
కొవిడ్ వల్ల వచ్చిన ఇబ్బందులు తాత్కాలికమని గుర్తించాలి
- డాక్టర్ భాగ్యారావు, మానసిక వైద్య నిపుణులు
గతంతో పోలిస్తే మానసిక సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా డిప్రెషన్ బాధితుల సంఖ్య 15 నుంచి 25 శాతానికి పెరిగింది. భవిష్యత్తుపై ఆందోళన, కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామన్న ఆలోచన ఇందుకు కారణమవుతున్నాయి. సీరియస్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయి. వీటి నుంచి బయటపడేందుకు కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడపాలి. ఇంట్లో వుండే ఇబ్బందులను భార్యాభర్తలు కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. కొవిడ్ వల్ల వచ్చిన ఇబ్బందులు తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుటుంబ సభ్యులు ఒకరికొకరు భరోసాను కల్పించుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.