కొవిడ్‌ మరణాలు 500

ABN , First Publish Date - 2020-11-21T06:06:58+05:30 IST

జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 500కు చేరింది. మొదటి పాజిటివ్‌ కేసు మార్చి 19న నమోదు కాగా, రెండు నెలల తరువాత అంటే మార్చి ఎనిమిదిన మొదటి మరణం సంభవించింది.

కొవిడ్‌ మరణాలు 500

అత్యధికంగా ఆగస్టు నెలలో 267 మంది కన్నుమూత


విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 500కు చేరింది. మొదటి పాజిటివ్‌ కేసు మార్చి 19న నమోదు కాగా, రెండు నెలల తరువాత అంటే మార్చి ఎనిమిదిన మొదటి మరణం సంభవించింది. మే, జూన్‌, జూలై నెలల్లో కలిపి 91 మంది మృతిచెందగా, ఆగస్టు నెల లోనే అత్యధికంగా 267 మంది చనిపోయారు. సెప్టెం బరు నెలలోను కరోనా ఉధృతి కొనసాగడంతో 143 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అక్టోబరు నెలలో 77 మంది, నవంబరు నెలలో ఇప్పటివరకు 22 మంది మరణించారు. మొదటి మరణం సంభవించిన మే ఎనిమిది నుంచి ఇప్పటివరకు 197 రోజుల్లో 500 మంది వైరస్‌ బారినపడి మృత్యువాత చెందారు. 


జిల్లాలో మరో 69 కేసులు నమోదు

కాగా, జిల్లాలో శుక్రవారం మరో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 58,074కు చేరుకుంది. ఇందులో 56,292 మంది కోలుకోగా, మరో 1,282 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more