పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-11-06T05:57:02+05:30 IST

ప్రతి పాఠశాలలో విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎంఈవో ప్రసాద్‌ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. విద్యార్ధులకు ఉపాధ్యాయులు థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించాలన్నారు.

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి
కోటవురట్ల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల భౌతిక దూరం

  కోటవురట్ల, నవంబరు 5: ప్రతి పాఠశాలలో విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎంఈవో ప్రసాద్‌ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. విద్యార్ధులకు ఉపాధ్యాయులు థర్మల్‌ స్ర్కీనింగ్‌   నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు చేతులకు గ్లౌజులు, నోటికి మాస్కూలు ధరించి, వ్యక్తిగత జాగ్రత్తలు  పాటించాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భోజనం చేసేటప్పుడు, పాఠశాల గదుల్లో బోధనలు వినేటప్పుడు విద్యార్థులు భౌతిక దూరం పాటిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇంటి నుంచి బయల్దేరినప్పుడు మాస్కులతోనే బయటకు రావాలన్నారు. ఇదిలావుంటే, మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతులను నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-11-06T05:57:02+05:30 IST