-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » covid
-
198 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-11-21T06:21:52+05:30 IST
జిల్లాలో శుక్రవారం కొత్తగా 198 మందికి కరోనా వైరస్ సోకింది.

మరో ఇద్దరు బాధితులు మృతి
ఆసుపత్రుల నుంచి 281 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో శుక్రవారం కొత్తగా 198 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో మరో ఇద్దరు బాధితులు మహమ్మారికి బలైపోయారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 44,121కి పెరిగాయి. కరోనా మరణాలు అధికారికంగా 619కు చేరుకున్నాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 281 మంది పాజిటివ్ బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,107 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.