కొవిడ్‌ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-07-08T09:41:54+05:30 IST

కొవిడ్‌ ఆసుపత్రులలో విధులు నిర్వహించేందుకు 95 నర్సు పోస్టులు, 26 అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేసినట్టు కేజీహెచ్‌

కొవిడ్‌ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలకు కౌన్సెలింగ్‌

మహారాణిపేట, జూలై 7: కొవిడ్‌ ఆసుపత్రులలో విధులు నిర్వహించేందుకు 95 నర్సు పోస్టులు, 26 అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేసినట్టు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌ తెలిపారు. జిల్లాలో 139 నర్సు పోస్టులు, 50 అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేసేందకు నోటిషికేషన్‌ ఇచ్చినట్టు వివరించారు.


వారికి మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించి, నియామక పత్రాలు అందించామన్నారు. మిగిలిన పోస్టులు త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాదేవి,  ఆర్‌ఎమ్‌ఓలు డాక్టర్‌ అంజిబాబు, డాక్టర్‌ విజయ్‌శంకర్‌, డాక్టర్‌ హెచ్‌ఆర్‌కే దొర,  డాక్టర్‌ సాధన, డాక్టర్‌ బింధుమాధవి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T09:41:54+05:30 IST