-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » COUNSELING
-
ప్రశాంతంగా ముగిసిన కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-12-11T05:08:48+05:30 IST
ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్‌వైజర్లకు గ్రేడ్-1 సూపర్‌వైజర్లుగా పదోన్నలు కల్పించేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

పెదవాల్తేరు, డిసెంబరు 10: ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్‌వైజర్లకు గ్రేడ్-1 సూపర్‌వైజర్లుగా పదోన్నలు కల్పించేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చినవాల్తేరులోని మహిళాబివృద్ధి-శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం ఆర్జేడీ శైలజ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 90 మందికి పైగా సూపర్‌వైజర్లు హాజరవ్వగా, విశాఖ మహిళాభివృద్ధి సంస్థ పీడీ సీతామహాలక్ష్మి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పీడీలు, సూపరింటెండెంట్లు శ్రీనివాస్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.