90 మంది ఉపాధ్యాయులకు కరోనా!

ABN , First Publish Date - 2020-11-07T06:38:43+05:30 IST

జిల్లాలో శుక్రవారం నాటికి 90 మంది ఉపాధ్యాయులు సహా తొమ్మిది మంది విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు.

90 మంది ఉపాధ్యాయులకు కరోనా!

విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నాటికి 90 మంది ఉపాధ్యాయులు సహా తొమ్మిది మంది విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో నడుస్తున్న ఉన్నత పాఠశాలల్లో పనిచేసే 11,219 మంది ఉపాధ్యాయుల్లో ఇప్పటివరకూ 8,830 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం వరకు 71 మంది టీచర్లు, నలుగురు విద్యార్థులకు కొవిడ్‌ నిర్ధారణ కాగా శుక్రవారం మరో 19 మంది టీచర్లు, ఇద్దరు విద్యార్థులు వైరస్‌ బారినపడినట్టు నిర్ధారణ అయ్యింది. మరో 2300 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో పిల్లలను పాఠశాలలకు పంపాలా?, లేదా? అన్న సందేహం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నది. పాఠశాలలు మూసివేసి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని కొంతమంది తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-07T06:38:43+05:30 IST