విద్యార్థులకు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-11-06T05:39:09+05:30 IST

జీవీఎంసీ 12వ వార్డు (ఓల్డ్‌) ఎన్‌జీజీఓస్‌ కాలనీ విద్యుత్‌నగర్‌లోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు.

విద్యార్థులకు కరోనా పరీక్షలు
కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

అక్కయ్యపాలెం: జీవీఎంసీ 12వ వార్డు (ఓల్డ్‌) ఎన్‌జీజీఓస్‌ కాలనీ విద్యుత్‌నగర్‌లోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కవితా పట్నాయక్‌ ఆధ్వర్యంలో మొత్తం 70 మంది విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు ఎం.రాజేశ్వరి, ఎం.కమలమ్మ, వి.కల్యాణి, వి.తంబాడి, రామలక్ష్మి, సెనాజ్‌బేగం, పాఠశాల పీడీ ఎ.సునంద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T05:39:09+05:30 IST