జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా ప్రత్యేక సెల్‌

ABN , First Publish Date - 2020-03-30T10:29:32+05:30 IST

కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా ప్రత్యేక సెల్‌

విశాఖపట్నం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ పరిధిలో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే అలాంటి వారు జీవీఎంసీని సంప్రదించేందుకు, కరోనా లక్షణాలు ఉన్న వారెవరైనా కనిపిస్తే వారికి సంబంధించిన సమాచారం అందజేసేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.


24 గంటలు అందుబాటులో మూడు షిప్టుల్లో నిరంతరం పనిచేసే సిబ్బంది తమకు అందిన ఫిర్యాదులు లేదా సమాచారాన్ని సంబంధిత జోనల్‌ కమిషనర్లు, ప్రత్యేక బృందాలకు అందజేస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కె.తిరుమలరావు(7396045405), మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కేవీ రమణ(9885973848), రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎన్‌ అప్పారావు(8019287823) అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు.

Updated Date - 2020-03-30T10:29:32+05:30 IST