వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డ్రైవర్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-07-20T22:25:06+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశీ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.

వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డ్రైవర్‌కు కరోనా

విశాఖపట్నం : జిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశీ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆదివారం నాడు కరోనా పరీక్షలు చేసుకున్న ఆయనకు సోమవారం మధ్యాహ్నం పాజిటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు అంతరంగిక భద్రతా సిబ్బంది అంతా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. తాను ఫోన్ టచ్‌లో ఉంటానని ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలకు కరణం సూచించారు. కాగా ఈ మధ్య అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. గత నాలుగైదు రోజులుగా రోజుకో ఎమ్మెల్యే కరోనా బారిన పడుతుండటం గమనార్హం.

Updated Date - 2020-07-20T22:25:06+05:30 IST