కనిష్ట స్థాయికి కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-01T06:14:41+05:30 IST
జిల్లాలో 180 రోజుల తరువాత కనిష్ట సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం అత్యల్పంగా 11 మందికి వైరస్ నిర్ధారణ అయింది.

జిల్లాలో మరో 11 మందికి వైరస్
180 రోజుల తరువాత అత్యల్పంగా నమోదు
చికిత్స పొందుతూ ఒకరి మృతి
విశాఖపట్నం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 180 రోజుల తరువాత కనిష్ట సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం అత్యల్పంగా 11 మందికి వైరస్ నిర్ధారణ అయింది. జూన్ నాలుగో తేదీన నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత నుంచి జిల్లాలో కేసులు పెరుగుతూ వచ్చాయి. తాజాగా, సోమవారం అతి తక్కువగా నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 58,675కు చేరుకున్నాయి. వీరిలో వైరస్ నుంచి 57,377 మంది కోలుకోగా, మరో 788 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఒకరు మృతి చెందగా, జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాలు 510కు చేరాయి.