-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » corona
-
మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-25T05:55:22+05:30 IST
జిల్లాలో కొద్ది రోజులుగా కనిష్ట స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం స్వల్పంగా పెరిగాయి.

మరో 86 మందికి వైరస్
జిల్లాలో 58,325కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
చికిత్స పొందుతూ మరొకరి మృతి
విశాఖపట్నం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొద్ది రోజులుగా కనిష్ట స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఐదు నెలల తరువాత కనిష్ట స్థాయిలో 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మంగళవారం స్వల్పంగా పెరిగి 86 కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 58,325కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 56,657 మంది కోలుకోగా, మరో 1164 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం ఒకరు మృతి చెందగా, మొత్తం కొవిడ్ మరణాలు 504కు చేరాయి.