ములగాడలో కోరమాండల్‌ మాక్‌డ్రిల్‌

ABN , First Publish Date - 2020-11-27T05:39:26+05:30 IST

కోరమాండల్‌ కంపెనీ సమీపంలోని ములగాడ గ్రామంలో గురువారం ఆ సంస్థ మాక్‌డ్రిల్‌ నిర్వహించింది.

ములగాడలో కోరమాండల్‌ మాక్‌డ్రిల్‌
క్షతగాత్రులను అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కోరమాండల్‌ కంపెనీ సమీపంలోని ములగాడ గ్రామంలో గురువారం ఆ సంస్థ మాక్‌డ్రిల్‌ నిర్వహించింది. అమోనియం టాక్సిక్‌ గ్యాస్‌ దుర్వాసన వెలువరించి, దానిని నివారణకు, స్థానికులను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై సిబ్బందితో మాక్‌డ్రిల్‌ చేశారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఫ్యాక్టరీస్‌ జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివశంకరరెడ్డిల నేతృత్వంలో దీనిని నిర్వహించారు.

Read more