-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Congress
-
‘పేట’, కోటవురట్ల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
ABN , First Publish Date - 2020-12-15T06:08:22+05:30 IST
పాయకరావుపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెరుమాళ్ళ వెంకటరమణ, కోటవురట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నడింపల్లి నూకరాజు నియమితులయ్యారు.

పాయకరావుపేట/ కోటవురట్ల డిసెంబరు 14 : పాయకరావుపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెరుమాళ్ళ వెంకటరమణ, కోటవురట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నడింపల్లి నూకరాజు నియమితులయ్యారు. నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం వీరికి అనకాపల్లి పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రుత్తల శ్రీరామ్మూర్తి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌లు నియామక పత్రాలు అందజేశారు. వీరిని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తాళ్ళూరి విజయ్‌కుమార్ తదితరులు అభినందించారు.