తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

ABN , First Publish Date - 2020-12-11T05:19:11+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ అన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
కోట్ని బాలాజీ

పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ


తుమ్మపాల, డిసెంబరు 10: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి తిరుపతి రూరల్‌ మండలానికి పరిశీలకునిగా అధిష్ఠానం తనను నియమించిందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే టీడీపీ గెలుపునకు సోపానాలన్నారు. తిరుపతి టీడీపీ నాయకుల సమన్వయంతో పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-11T05:19:11+05:30 IST