రూ.11.39 కోట్లతో ప్రహరీల నిర్మాణం
ABN , First Publish Date - 2020-02-08T12:35:00+05:30 IST
గిరిజన సంక్షేమ శాఖ అరకు సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 106 పాఠశాలలకు మనబడి, నాడు-నేడు పథకం కింద ప్రహరీల నిర్మాణానికి

- నాడు-నేడు కార్యక్రమం కింద 106 పాఠశాలలకు మంజూరు
- గిరిజన సంక్షేమ శాఖ ఈఈ మురళి
అరకులోయ: గిరిజన సంక్షేమ శాఖ అరకు సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 106 పాఠశాలలకు మనబడి, నాడు-నేడు పథకం కింద ప్రహరీల నిర్మాణానికి రూ.11.39 కోట్లు మంజూరైనట్టు టీడబ్ల్యూ ఈఈ మురళి తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. అరకులోయ మండలంలో 15 పాఠశాలలకు రూ. 218. 03 లక్షలు, అనంతగిరిలో 23 పాఠశాలలకు రూ. 169.43 లక్షలు, డుంబ్రిగుడలో 18 పాఠశాలలకు రూ.237.65 లక్షలు, హుకుంపేటలో 23 పాఠశాలలకు రూ.637.35 లక్షలు, పెదబయలులో రూ.14 పాఠశాలలకు రూ.140.04 లక్షలు, ముంచంగిపుట్టులో 13 పాఠశాలలకు రూ. 236.93 లక్షలతో ప్రహరీలు నిర్మించనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పీఓ ప్రత్యేకంగా అరకు సబ్ డివిజన్ పరిధిలోని 48 టీడబ్ల్యూ ఆశ్రమోన్నత పాఠశాలల్లో ప్రహ రీల పనులకు రూ. 12.01 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రస్తు తం ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇవికాకుండా పలు గ్రామాల్లో వంతెనల నిర్మా ణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. త్వరలోనే వీటికి కూడా నిధులు మంజూరు కానున్నట్టు చెప్పారు.