-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Commissioner observation on the development of parks
-
పార్కుల అభివృద్ధిపై కమిషనర్ పరిశీలన
ABN , First Publish Date - 2020-11-28T05:05:17+05:30 IST
జోన్-2 పరిధిలోని వెంకోజీపాలెం హరితవనం పార్కును రూ.60 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన ఉద్యాన శాఖాధికారులు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ సభ్యులతో కలిసి శుక్రవారం పార్కును పరిశీలించారు.

వెంకోజీపాలెం, నవంబరు 27: జోన్-2 పరిధిలోని వెంకోజీపాలెం హరితవనం పార్కును రూ.60 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన ఉద్యాన శాఖాధికారులు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ సభ్యులతో కలిసి శుక్రవారం పార్కును పరిశీలించారు. పార్కు అభివృద్ధి స్థలంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యాజ్యం త్వరతగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జోన్-2 పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. అనంతరం ఎంవీపీ కాలనీ 7వ వార్డు హెడెన్ స్కౌట్స్ దివ్యాంగుల పాఠశాల భవన స్థలం అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించారు. పర్యటనలో హార్టీకల్చరల్ డైరెక్టర్ ఎం.దామోదరావు, పర్యవేక్షక ఇంజనీరు రాజారావు, కార్యనిర్వాహక ఇంజనీరు మెహర్‌బాబా, తదితరులు పాల్గొన్నారు.