మినీ ట్రక్కుల దరఖాస్తుదారులకు నేడు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-12-04T04:47:54+05:30 IST

యువత ఉపాధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న మినీ ట్రక్కులకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికులు అధికారులు కోరిన అన్ని ధ్రువపత్రాలతో శుక్రవారం ఇంటర్వ్యూలకు హాజరు కావాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ కోరారు.

మినీ ట్రక్కుల దరఖాస్తుదారులకు నేడు ఇంటర్వ్యూలు

విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ 

మహారాణిపేట, డిసెంబరు 3: యువత ఉపాధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న మినీ ట్రక్కులకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికులు అధికారులు కోరిన అన్ని ధ్రువపత్రాలతో శుక్రవారం ఇంటర్వ్యూలకు హాజరు కావాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ కోరారు. దరఖాస్తుదారులు తమ గ్రామ, వార్డు పరిధిలోని మండల, మున్సిపల్‌, జోనల్‌ కార్యాలయాల్లో ఇందుకోసం నిర్దేశించిన కమిటీల ముందు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని తెలిపారు. దరఖాస్తుదారులు విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్‌, తెల్ల రేషన్‌ కార్డు, లైట్‌ మోటారు వెహికల్‌ (ఎల్‌ఎంవీ) డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు రెండు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకు రావాలని సూచించారు. , భూపరిరక్షణ  కమిటీ సభ్యులు జి.సింహాచలం, జి.గోవర్థన్‌, జి.రాము తదితరులు ఉన్నారు. 

  Updated Date - 2020-12-04T04:47:54+05:30 IST