కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలి

ABN , First Publish Date - 2020-11-03T05:59:01+05:30 IST

విద్యా సంస్థలు తెరుచుకున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీచేసిన కొవిడ్‌ మార్గదర్శకాలు ఆయా పాఠశాలల్లో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని జల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌

మహారాణిపేట, నవంబరు 2: విద్యా సంస్థలు తెరుచుకున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీచేసిన కొవిడ్‌ మార్గదర్శకాలు ఆయా పాఠశాలల్లో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని జల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పరీక్షలు చేయాలని, మాస్క్‌ ధరించేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల శానిటైజేషన్‌తోపాటు తరగతి గదుల శానిటైజేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతిరోజు తరగతి గదిలో కరోనాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ అరుణబాబు, డీఈవో రామలింగేశ్వరరెడ్డి, డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ, డిప్యూటీ డీఈఓ నాగమణి, ఆర్‌ఐవో బి.సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు

ఉపాధి పనులు వేగవంతం చేయాలి

 జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-03T05:59:01+05:30 IST