మన్యంలో పెరిగిన చలి

ABN , First Publish Date - 2020-12-31T05:23:26+05:30 IST

ఏజెన్సీలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. ఉత్తరాది నుంచి శీతల గాలులు కొనసాగుతుండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

మన్యంలో పెరిగిన చలి
చింతపల్లిలో దట్టంగా కురుస్తున్న మంచు

చింతపల్లిలో 7 డిగ్రీలు


చింతపల్లి, డిసెంబరు 30: ఏజెన్సీలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. ఉత్తరాది నుంచి శీతల గాలులు  కొనసాగుతుండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు దట్టంగా కురుస్తున్నది. ఉదయం పది గంటల వరకు సూర్యుడి కనిపించడంలేదు. కాగా పొగమంచు అందాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. 


పాడేరులో దట్టంగా పొగమంచు

పాడేరు: పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 11 గంటల వరకు ఎండ రాలేదు. చలిసైతం అధికంగానే ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మోస్తరుగా ఎండ కాయగా, మిలిగిన సమయమంతా మసుగ్గా వుంది.


Updated Date - 2020-12-31T05:23:26+05:30 IST