కరోనాపై సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2020-03-18T10:42:26+05:30 IST

కరోనా వైరస్‌ పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారపూరిత ధోరణికి అ ద్దం పడుతున్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వి

కరోనాపై సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

సింహాచలం, మార్చి 17: కరోనా వైరస్‌ పట్ల  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారపూరిత ధోరణికి అ ద్దం పడుతున్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వి మర్శించారు. మంగళవారం సింహాచలంలో జరిగిన  మహావిశాఖ 98వ వార్డు తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం అనంతరం విలేఖరుల తో మాట్లాడుతూ అమెరికా, చైనాలతో పాటు మన దేశానికి చెందిన ఎంద రో శాస్త్రవేత్తలు ఇప్పటికే కరోనా వైరస్‌ మూలాలు కనుగొనే యత్నంలో ఉన్నారని,  ఈ తరుణంలో సీఎం తన ఇంటి నుంచి బయటకు రాకుండా నోటికి వచ్చినట్టుగా పారాస్యుటమాల్‌ మాత్రలు వేసుకోవడం, బ్లీచింగ్‌ చల్లడం వల్ల కరోనా తగ్గిపోతుందంటూ మాట్లాడటం అపహాస్యం చేసిన ట్లే అన్నారు.


కరోనాకు అదే నివారణైతే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మృత్యువాత పడటం, 1.7లక్షల మందికి వ్యాధి సోకితే వైద్యులు ఎందుకు చూస్తూ ఊరుకుంటారనే విషయం కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు మితిమీరిన అధికారం ఇవ్వడంతో సీఎం కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు సీఎం బాధ్యతా రాహిత్యానికి, అవగాహనా లేమికి నిదర్శనంగా నిలుస్తున్నాయని బండారు ఎండగట్టారు.

Updated Date - 2020-03-18T10:42:26+05:30 IST