ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం

ABN , First Publish Date - 2020-10-31T06:02:39+05:30 IST

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చారు.

ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్కే బీచ్‌ రోడ్డులో గల పార్క్‌ హోటల్‌కు చేరుకుని వధూవరులు డాక్టర్‌ సుమ, డాక్టర్‌ చిన్నంనాయుడులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి అదే ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరారు. ఈ వివాహానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.

Read more