ఆకాశంలో మేఘాలు.. ఆందోళనలో రైతులు

ABN , First Publish Date - 2020-12-20T05:54:33+05:30 IST

మూడు రోజులుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు సాయంత్రం వేళల్లో ఆకాశంలో మబ్బులు వేయడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

ఆకాశంలో మేఘాలు.. ఆందోళనలో రైతులు
వరిమోపులు తీసుకువెళుతున్న రైతన్నలు


చీడికాడ, డిసెంబరు 19: మూడు రోజులుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు సాయంత్రం వేళల్లో ఆకాశంలో మబ్బులు వేయడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వరి చేను కోసిన తర్వాత వారం రోజుల్లో కళ్లాలకు తీసుకురావాల్సి ఉంది. కానీ, మేఘాలు కమ్ముకోవడంతో ఆరకపోయినా వరిచేనును రైతులు మోసుకువస్తున్నారు. కూలీల కొరత ఉన్నా అదనంగా కూలి ఇచ్చి వరిచేను తీసుకువస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసినా గిట్టుబాటు ధర రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-12-20T05:54:33+05:30 IST