ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దు

ABN , First Publish Date - 2020-11-07T05:23:40+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు కోరారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దు
హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు

హెచ్‌పీసీఎల్‌ వద్ద సీటూ ఆందోళన

మల్కాపురం, నవంబరు 6 : ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు కోరారు. హెచ్‌పీసీఎల్‌ సౌత్‌ గేటు వద్ద శుక్రవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, పోర్టు, స్టీల్‌ప్లాంట్‌, రక్షణ విభాగాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు, ప్రజలు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం జోన్‌ నాయకులు పైడిరాజు, కె.పెంటారావు, ఆర్‌.లక్ష్మణమూర్తి, టి.అప్పారావు, హెచ్‌పీసీఎల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.కృష్ణారావు, బీఎస్‌ఆర్‌ మూర్తి, పి.సురేశ్‌, కె.రాము, జి.నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-07T05:23:40+05:30 IST