కదం తొక్కిన ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు
ABN , First Publish Date - 2020-12-31T05:17:12+05:30 IST
ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు అమ్మఒడితోపాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మండల కార్యదర్శి ఎల్.సుందరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్
సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు
పాడేరురూరల్, డిసెంబరు 30: ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు అమ్మఒడితోపాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మండల కార్యదర్శి ఎల్.సుందరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని సంక్షేమ పఽథకాలకు దూరం చేయడం విచారకరమని అన్నారు. అనంతరం డీటీ ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం అందించారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల సంఘం నాయకులు భాగ్యలక్ష్మి, అంబాలమ్మ, దాసమ్మ, దేవి, అంబిక, తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టులో...
స్కీమ్ వర్కర్లుగా వున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు అమ్మఒడితోపాటు ఇతర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ముంచంగిపుట్టు మండల కార్యదర్శి భీమరాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎం.శ్యాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ కె.త్రినాఽథ్, నారాయణ, జీనబంధు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హుకుంపేటలో....
సీఐటీయూ జిల్లా నేత ఎస్.హైమావతి ఆధ్వర్యంలో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు హుకుంపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నేత రామారావు, తదిరులు పాల్గాన్నారు.
చింతపల్లిలో...
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ ఆధ్వర్యంలో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకి వినతి పత్రం అందజేశారు.