లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-06T05:50:45+05:30 IST

చోడవరం కోర్టు సముదాయంలో ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయాలని స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి పీఆర్‌ రాజీవ్‌ విజ్ఞప్తి చేశారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి
అధికారులతో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజీవ్‌

చోడవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజీవ్‌


చోడవరం, డిసెంబరు 5: చోడవరం కోర్టు సముదాయంలో ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయాలని స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి పీఆర్‌ రాజీవ్‌ విజ్ఞప్తి చేశారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించేందుకు శాఖల వారీగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎంఎస్‌.డీ.ఉమాదేవి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.శ్రీనివాస్‌, సెకెండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి వి.రమణమ్మ, బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షులు పోతల ప్రకాశరావు, ఏజీపీ సుబ్బులక్ష్మి, పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Read more