చిచ్చరపిడుగులు

ABN , First Publish Date - 2020-12-15T06:34:41+05:30 IST

వరల్డ్‌ ఫిడే కేడెట్‌, యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎం.సాహితి వర్షిణి, బి.కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్‌ ప్రసాద్‌ అద్భుత ప్రతిభ కనబరిచారు.

చిచ్చరపిడుగులు
సాహితి వర్షిణి, కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్‌ ప్రసాద్‌


ప్రపంచ చెస్‌ టోర్నీలో సత్తా చాటిన విశాఖ చిన్నారులు


విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 14: వరల్డ్‌ ఫిడే కేడెట్‌, యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎం.సాహితి వర్షిణి, బి.కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్‌ ప్రసాద్‌ అద్భుత ప్రతిభ కనబరిచారు. సోమవారం ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. బాలికల అండర్‌-14 విభాగంలో ఎం.సాహితి వర్షిణి నాల్గవ స్థానం, అండర్‌-18 కేటగిరీలో బి.కల్యాణి తొమ్మిదో స్థానం, అండర్‌-10 విభాగంలో దేవకి నందన 19వ స్థానం, అలన మీనాక్షి 20వ స్థానాలు సాధించారు. బాలుర అండర్‌-10 విభాగంలో అఖిల్‌ ప్రసాద్‌ 34వ స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచ స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొని ఉన్నత స్థానాలను సాధించిన చిన్నారులను విశాఖ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఆనందకుమార్‌, పి.సుబ్బారెడ్డి, ఇతర ప్రతినిధులు అభినందించారు.

Updated Date - 2020-12-15T06:34:41+05:30 IST