-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » child rights protection week
-
బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యత
ABN , First Publish Date - 2020-11-22T04:09:19+05:30 IST
బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యత అని తహసీల్దార్ పైల రామారావు అన్నారు. చైల్డ్‌లైన్ 1098, సీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చినముషిడివాడ చాణక్యనగర్‌లో శనివారం బాలల హక్కుల పరిరక్షణకు ప్రజా అవగాహన చైతన్య వారోత్సవాలు నిర్వహించారు.

తహసీల్దార్ పైల రామారావు
పెందుర్తి, నవంబరు 21: బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యత అని తహసీల్దార్ పైల రామారావు అన్నారు. చైల్డ్‌లైన్ 1098, సీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చినముషిడివాడ చాణక్యనగర్‌లో శనివారం బాలల హక్కుల పరిరక్షణకు ప్రజా అవగాహన చైతన్య వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే బాలలకు హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్‌లైన్ సీడబ్ల్యూసీ శ్యామలారాణి మాట్లాడుతూ చైల్డ్‌లైన్ 1098 సేవలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను సచివాలయ సిబ్బంది తీసుకోవాలన్నారు. సభాధ్యక్షత వహించిన సీడ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వి.సన్యాసిరాజు మాట్లాడుతూ వివక్షకు గురవుతున్న బాలలకు తక్షణ సహాయంగా చైల్డ్‌లైన్ పనిచేస్తుందన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందికి సీడ్ ఆర్గనైజేషన్ శిక్షకులు బాలల హక్కుల పరిరక్షణపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీడీపీవో సంతోషకుమారి, గణేశ్, చైల్డ్‌లైన్ సమన్వయకర్త డేవిడ్‌రాజు, నిరపమ, మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.