గిరిజన ద్రోహి చంద్రబాబు: ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
ABN , First Publish Date - 2020-07-19T18:53:59+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ద్రోహి అని..

మద్దిలపాలెం(విశాఖపట్నం): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ద్రోహి అని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విమర్శించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో బాక్సైట్ పేరుతో గిరిజనుల ఆస్తులను దోచుకునేందుకు యత్నించారని ఆరోపించారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నామన్నారు. వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉందన్నారు.