వణికిస్తున్న చలి
ABN , First Publish Date - 2020-11-13T06:00:43+05:30 IST
మండలంలో చలి పంజా విసురుతున్నది
అనంతగిరి, నవంబరు 12: మండలంలో చలి పంజా విసురుతున్నది. రాత్రి వేళలతోపాటు పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్థానికులు చలికి వణుకుతున్నారు. రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తుండడంతో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో శీతలగాలులతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.