నవోదయ ఉద్యోగులకు సీసీఎస్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T05:39:07+05:30 IST

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2004 జనవరి ఒకటో తేదీకి ముందు సర్వీస్‌లో చేరిన ఉద్యోగులందరికీ సీసీఎస్‌ (పాత పెన్షన్‌) విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ ఆల్‌ నవోదయ విద్యాలయ సమితి స్టాఫ్‌ అసోసియేషన్‌ (ఏఎన్‌వీఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

నవోదయ ఉద్యోగులకు సీసీఎస్‌ అమలు చేయాలి
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ఎంపీ ఎంవీపీ సత్యనారాయణకు ఏఎన్‌వీఎస్‌ఎస్‌ఏ వినతి 

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 29: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2004 జనవరి ఒకటో తేదీకి ముందు సర్వీస్‌లో చేరిన ఉద్యోగులందరికీ సీసీఎస్‌ (పాత పెన్షన్‌) విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ ఆల్‌ నవోదయ విద్యాలయ సమితి స్టాఫ్‌ అసోసియేషన్‌ (ఏఎన్‌వీఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. కొమ్మాది జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ కె.సంజయ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ లావు ఈశ్వరమ్మ, అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.మహేశ్‌, ప్రతినిధులు సుమలత, సత్యనారాయణ, ప్రద్యుమ్న, మనోహర్‌, ఆర్‌పీ సింగ్‌ తదితరులు ఎంపీని కలిశారు. 1985లో నవోదయ విద్యాలయాలు ఏర్పడినా ఇప్పటివరకు ఉద్యోగులకు ఎలాంంటి పెన్షన్‌ విధానం లేకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని  ఎంపీకి వివరించారు. దీనిపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, పార్లమెంట్‌ దృష్టికి నవోదయ ఉద్యోగుల పెన్షన్‌ విషయాన్ని తీసుకువెళ్లి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Updated Date - 2020-12-30T05:39:07+05:30 IST