నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం

ABN , First Publish Date - 2020-12-20T05:42:40+05:30 IST

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడ తాయని నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం
పోలీస్‌ స్టేషన్‌ భవనంలో సీసీ కెమెరాలు ప్రారంభిస్తున్న ఏఎస్పీ తుహిన్‌సిన్హా

   మాకవరపాలెం, డిసెంబరు 19 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడ తాయని నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. కొత్తగా ఇక్కడ నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనంతో పాటు సీసీ కెమెరాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని మాకవరపాలెం, కొండలఅగ్రహారం, దాలింపేట, రాచపల్లి, తామరం గ్రామాల్లో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నేరస్థులను గుర్తించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయన్నారు. అనంతరం వర్తక సంఘం ప్రతినిధులు ఆయనను సత్కరించారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి, ఎస్‌ఐ కరక రాము, వైసీపీ నాయకుడు రుత్తల వాసు, వర్తక సంఘం సభ్యులు రఘబాబు, కట్టా రామారావు, ప్రకాశరావు, శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:42:40+05:30 IST