కారిడార్‌ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాల్సిందే

ABN , First Publish Date - 2020-11-21T05:38:03+05:30 IST

విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసిత రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, పూర్తి ప్యాకేజీ చెల్లించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు.

కారిడార్‌ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాల్సిందే
రైతులతో మాట్లాడుతున్న అనిత

 టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యురాలు అనిత

నక్కపల్లి, నవంబరు 20 : విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసిత రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, పూర్తి ప్యాకేజీ చెల్లించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు టీడీపీ నేతలు కొప్పిశెట్టి వెంకటేశ్‌, గింజాల లక్ష్మణరావు నేతృత్వంలో శుక్రవారం నక్కపల్లి వచ్చిన అనితను కలిసి తమ సమస్యలు వివరించారు. 25న ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారని, పల్లె ప్రాం తాల్లో రసాయన, పెట్రో కెమికల్‌ పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అనిత మాట్లాడుతూ తాను ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడతానని చెప్పారు. 

Read more