బస్సు పాస్ జారీ కౌంటర్ల విస్తరణ
ABN , First Publish Date - 2020-11-04T03:10:59+05:30 IST
జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల రవాణాకు తొందరగా బస్సు పాస్‌లను జారీ చేయాలని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది.
సింహాచలం, గాజువాక, ఎంవీపీలో కౌంటర్లు
ద్వారకాబస్‌స్టేషన్, నవంబరు 3 : జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల రవాణాకు తొందరగా బస్సు పాస్‌లను జారీ చేయాలని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం నుంచి మద్దిలపాలెం, ద్వారకాబస్‌స్టేషన్, స్టీల్ సిటీ డిపోల కౌంటర్ల నుంచి విద్యార్థులకు బస్ పాస్‌లు జారీ చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల విద్యార్థులకు అవి అందుబాటులో లేకపోయాయి. దీనిని గుర్తించిన పీటీడీ అధికారులు సింహాచలం, గాజువాక, ఎంవీపీ కాలనీలలోని కౌంటర్ల ద్వారా కూడా స్టూడెంట్ బస్ పాస్‌లు జారీ చేయడం జరుగుతుందని రీజనల్ మేనేజర్ ఎంవై దానం ఒక ప్రకటనలో తెలిపారు.