కశింకోటలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-17T06:23:10+05:30 IST

మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు.

కశింకోటలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
కశింకోటలో ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కశింకోట, డిసెంబరు 16: మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. సంఘ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ మాట్లాడుతూ, విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పూనుకుంటే ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయించడం అన్యాయమన్నారు. హక్కుల సాధనకు పోరాటాడు సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రతినిధులు ఆడారి వెంకటరావు, రవ్వా మల్లేశ్‌, శంకర్‌, సూరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T06:23:10+05:30 IST