ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం చేశారు?
ABN , First Publish Date - 2020-07-10T09:56:53+05:30 IST
రైతులను ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం చేశారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు
అనకాపల్లి, జూలై 9: రైతులను ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం చేశారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో క్రాప్ హాలీడే ప్రకటించాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
వైఎస్ హయాంలోనే 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అటువంటిది వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేటని బుద్ద పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేతగానితనంతో రైతులను కష్టాల సుడిగుండంలోకి నెట్టివేసిందన్నారు. రైతులను ఆదుకునేందుకు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకటరావు, టీడీపీ నేత బొడ్డేడ మురళి ఉన్నారు.