గోస్తనీలో ఈతకు దిగిన బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-09-20T09:14:20+05:30 IST

తగరపువలస సమీపంలోని సంగివలస వద్ద ఈత కోసం గోస్తనీ నదిలో దిగిన నలుగురిలో ఒక బాలుడు హరి (14) మృతి చెందాడు. శనివారం న

గోస్తనీలో ఈతకు దిగిన బాలుడి మృతి

తగరపువలస, సెప్టెంబరు 19: తగరపువలస సమీపంలోని సంగివలస వద్ద ఈత కోసం గోస్తనీ నదిలో దిగిన నలుగురిలో ఒక బాలుడు హరి (14)  మృతి చెందాడు. శనివారం నలుగురు బాలురు సరదాగా గోస్తనీ నదిలో ఈతకు దిగగా హరి గల్లంతవ్వడంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన హరి తాటితూరులో తొమ్మిదో తరగతి చుదువుతున్నాడని స్థానికులు తెలిపారు.

Updated Date - 2020-09-20T09:14:20+05:30 IST