గోవాడలో 3న క్రషింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-27T05:37:07+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో వచ్చే నెల 3న క్రషింగ్‌ ప్రారంభిస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. కర్మాగారంలో గురువారం ఉదయం 5.30 గంటల ముహూర్తానికి బాయిలర్‌ను వెలిగించారు.

గోవాడలో 3న క్రషింగ్‌ ప్రారంభం
బాయిలర్‌ పూజలో పాల్గొన్న ఎండీ సన్యాసినాయుడు, అధికారులు

షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడు


చోడవరం, నవంబరు 26: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో వచ్చే నెల 3న క్రషింగ్‌ ప్రారంభిస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. కర్మాగారంలో గురువారం ఉదయం 5.30 గంటల ముహూర్తానికి బాయిలర్‌ను వెలిగించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ, ఈ ఏడాది నాలుగున్నర లక్షల టన్నులు చెరకు క్రషింగ్‌ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. బాయిలర్‌ పూజలో ఫ్యాక్టరీ ఏవో పప్పల రమణమూర్తి, సీసీ ప్రసాద్‌, వ్యవసాయాధికారులు మల్లికార్జునరెడ్డి, ప్రసాదరావు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. 

Read more