బాడీ లిఫ్టింగ్‌ పోటీలకు మంచి స్పందన

ABN , First Publish Date - 2020-12-29T06:06:40+05:30 IST

ఆంధ్రాబాడీ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ - 2020 పోటీలు నగరంలో ఘనంగా ముగిశాయి. మొత్తం 200 మంది ఔత్సాహికులు పోటీ పడగా ఓవరాల్‌ చాంప్‌గా జి.రామోజీరెడ్డి నిలిచారు.

బాడీ లిఫ్టింగ్‌ పోటీలకు మంచి స్పందన
విజేతలతో నిర్వాహకులు

ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు

 డాబాగార్డెన్స్‌, డిసెంబరు 28: ఆంధ్రాబాడీ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ - 2020 పోటీలు నగరంలో ఘనంగా ముగిశాయి. మొత్తం 200 మంది ఔత్సాహికులు పోటీ పడగా ఓవరాల్‌ చాంప్‌గా జి.రామోజీరెడ్డి నిలిచారు. ఆయనకు నిర్వాకులు ప్రత్యేక బహుమతితోపాటు రూ.5వేల నగదు అందించారు.


55 కేజీల విభాగంలో వంశీ నాయుడు, దిలీప్‌, రవితేజ, 60 కేజీల విభాగంలో సుమంత్‌, షబ్బీర్‌, రంగా, 65 కేజీల విభాగంలో ఆర్‌.గణేష్‌, ఎస్‌.రవికుమార్‌, భక్రత్‌ఖాన్‌, 70 కేజీల విభాగంలో జి.రామోజీరెడ్డి, బి.శంకర్‌, ఆర్‌.కుమార్‌, 75 కేజీల విభాగంలో జి.భాస్కర్‌రావు, పి.రాజు, ఎన్‌.మణికంఠ, 80 కేజీల విభాగంలో కె.సతీష్‌, వి.కనకరాజు, కె.నరేష్‌, 80 కేజీలు దాటిన విభాగంలో కె.తేజబాబు, ఎస్‌.తరుణ్‌, ఎస్‌.కిరణ్‌కుమార్‌, దివ్యాంగుల కేటగిరిలో ఇ.సూర్యనారాయణలు విజేతగా నిలిచారు.


40-50 కేజీల మాస్టర్స్‌ విభా గంలో ఎం.సత్తిబాబు, ఎ.శ్రీనివాసరావు, సిహెచ్‌.అప్పలరాజు, 40-50 కంటే ఎక్కువ గ్రాండ్‌మాస్టర్స్‌ విభాగంలో బి.ఆనందరావు, కె.రామనాయుడు, డి.ఎస్‌.ఎన్‌.రాజు, 65 కేజీలలోపు మహిళల విభాగంలో పి.అమృత,యు.నందు, సాధనకుమారి, 65 కేజీలు పైబడిన విభాగంలో పార్వతి, సిహెచ్‌.మీనా, ఎస్‌.లక్ష్మీదేవి విజేతలుగా నిలిచారు. 

Updated Date - 2020-12-29T06:06:40+05:30 IST