రుషికొండ తీరంలో బోటింగ్‌ నిలిపివేత

ABN , First Publish Date - 2020-09-24T09:35:30+05:30 IST

రుషికొండ తీరంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బోటింగ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌చార్జి లక్ష్మీదేవి తెలిపారు.

రుషికొండ తీరంలో బోటింగ్‌ నిలిపివేత


ఎండాడ, సెప్టెంబరు 23: రుషికొండ తీరంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బోటింగ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌చార్జి లక్ష్మీదేవి తెలిపారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో రుషికొండ తీరంలో బోటింగ్‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామన్నారు. సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే బోటింగ్‌ను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2020-09-24T09:35:30+05:30 IST