వ్యాపార వర్గాలతో పురందేశ్వరి భేటీ

ABN , First Publish Date - 2020-12-26T06:07:52+05:30 IST

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నగరంలోని వ్యాపార వర్గాలు, సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు

వ్యాపార వర్గాలతో పురందేశ్వరి భేటీ
సమావేశంలో పాల్గొన్న పురందేశ్వరి

విశాఖపట్నం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నగరంలోని వ్యాపార వర్గాలు, సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ విశాఖ అధ్యక్షులు ఎం.సుఽధీర్‌, సీఐఐ తరఫున శ్రీనివాసరాజు అధ్యక్షత వహించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే దానిపై పురందేశ్వరి వ్యాపార వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో సింబియోసిస్‌ సీఈఓ నరేశ్‌కుమార్‌, విమానాశ్రయం సలహా మండలి ఉపాధ్యక్షులు కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-26T06:07:52+05:30 IST