బీజేపీతోనే దేశంలో సుస్థిర పాలన

ABN , First Publish Date - 2020-11-13T05:59:21+05:30 IST

భారతీయ జనతా పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాగుతుందని ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు.

బీజేపీతోనే దేశంలో సుస్థిర పాలన
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్‌

ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ 

పాడేరు, నవంబరు 12: భారతీయ జనతా పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాగుతుందని ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు. అరకు జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు అధ్యక్షతన ఏజెన్సీ ప్రాంత బీజేపీ నేతలకు రెండు రోజులుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి సరైన పాలన అందించిన ఘటన బీజేపీకే దక్కిందన్నారు. ప్రపంచంలో భారతదేశానికి తగిన గుర్తింపు లభించేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తుదన్నారు. అలాగే తమ పార్టీలో క్రమశిక్షణతో కూడిన నేతలు, కార్యకర్తలున్నారన్నారు. వివిధ రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ శ్రేణులు రాష్ట్రంలోనూ బీజేపీ పుంజుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు, నేతలు రాజారావు, రామకృష్ణ, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T05:59:21+05:30 IST