అందరి అభిప్రాయంతోనే సంస్థాగత ఎన్నికలు

ABN , First Publish Date - 2020-11-20T05:12:25+05:30 IST

మూడేళ్ల నుంచి నక్కపల్లి మండలంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని, పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన సీనియర్‌ కార్యకర్తలను సంప్రదించిన తరువాతే మండల కమిటీలు ఏర్పాటు చేయాలని పలువురు పార్టీ నాయకులు కోరారు.

అందరి అభిప్రాయంతోనే సంస్థాగత ఎన్నికలు
విష్ణుకుమార్‌రాజుకు వినతిపత్రం అందిస్తున్న బీజేపీ నాయకులు

 బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజుకు నక్కపల్లి నేతల వినతి 

నక్కపల్లి, నవంబరు 19 : మూడేళ్ల నుంచి నక్కపల్లి మండలంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని, పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన సీనియర్‌ కార్యకర్తలను సంప్రదించిన తరువాతే  మండల కమిటీలు ఏర్పాటు చేయాలని పలువురు పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం విశాఖలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజును మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, బీజేపీ నాయకులు పేకేటి రాజారావు, అల్లు తాసు, నూకేశ్‌, కొల్నాటి అప్పారావు, ఎన్‌.సూరిబాబు, వెంకటేశ్వర్లు, మంగతాయరు, కాకర విజయలక్ష్మి తదితరులు కలిసి ఇటీవల నక్కపల్లి మండల బీజేపీలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు. నాయకులు, కార్యకర్తల సమావేశంలో అభిప్రాయ సేకరణ చేపట్టి నియమించాలని కోరారు.

Updated Date - 2020-11-20T05:12:25+05:30 IST