రైతుల ఉత్పత్తికి రక్షణ కోసమే వ్యవసాయ బిల్లులు: పురందేశ్వరి

ABN , First Publish Date - 2020-12-26T17:57:38+05:30 IST

మూడు వ్యవసాయ బిల్లుల వలన రైతులకు, వ్యవసాయ రంగానికి ఎటువంటి నష్టం వాటిల్లదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.

రైతుల ఉత్పత్తికి రక్షణ కోసమే వ్యవసాయ బిల్లులు: పురందేశ్వరి

విశాఖపట్నం: మూడు వ్యవసాయ బిల్లుల వలన రైతులకు, వ్యవసాయ రంగానికి ఎటువంటి నష్టం వాటిల్లదని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తికి రక్షణ కోసమే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చారని..మార్కెట్ యార్డులు ఎత్తివేయడం లేదన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు పట్టాలు ఇవ్వలేదని..కేవలం పొజిషన్ సర్టిఫికేట్‌లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కక్ష పూరిత రాజకీయాలు వద్దన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ వైఖరి చెప్పామని....ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. పోలవరం నుంచి మొహం చాటు వేయడం లేదని..వెనక్కి తగ్గడం లేదని పురందేశ్వరి తేల్చిచెప్పారు. ఒక రాజధానికి కట్టుబడి తాము ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదని పెట్టుబడిదారులు వాపోతున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ జనసేన ఆధర్యంలో ముందుకు వెళతామని పురందేశ్వరి పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-26T17:57:38+05:30 IST