రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలి

ABN , First Publish Date - 2020-12-06T05:41:43+05:30 IST

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ ఆరోపించారు.

రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న సురేంద్రమోహన్‌

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ 

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 5: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ ఆరోపించారు. రోడ్ల దుస్థితిపై శనివారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం సర్కిల్‌లో బీజేపీ నాయకులు నిరసర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్‌ మాట్లాడుతూ రహదారుల దుస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కాటూరి రవీందర్‌, బీజేపీ అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్‌తో పాటు పలు కార్యకర్తలు పాల్గొన్నారు. 


Read more