అస్తవ్యస్త రోడ్లపై కమల ద(గ)ళం

ABN , First Publish Date - 2020-12-06T06:06:46+05:30 IST

బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లాలోని రహదారుల అభివృద్ధికి ఆ పార్టీ శ్రేణులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

అస్తవ్యస్త రోడ్లపై కమల ద(గ)ళం
గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డుపై వంటా- వార్పు

 నక్కపల్లి, డిసెంబరు 5 : బీజేపీ అధిష్ఠానం  పిలుపు మేరకు జిల్లాలోని రహదారుల అభివృద్ధికి ఆ పార్టీ శ్రేణులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం నక్కపల్లిలో మాజీ ఎమ్మెల్యే  కాకర నూకరాజు ఆధ్వర్యంలో ఉపమాక  హైవే జంక్షన్‌ వద్ద  బైఠాయించారు. నక్కపల్లి నుంచి రాజయ్యపేట వరకూ అధ్వానంగా ఉన్న రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పేకేటి రాజారావు, వెంకటేశ్వరరావు, అల్లు తాసు, తిరుపతి రామారావు,  సూరిబాబు, పీవీఎన్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 


పాయకరావుపేటలో..

పాయకరావుపేట : మండలంలో పాడైన ప్రధాన రహదారులకు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరక శనివారం ఎంపీడీవో సాంబశివరావును కలిసి వినతి పత్రం అందజేశారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కువల కుమార్‌, ఇంజరపు సూరిబాబు,   మూర్తి, చంటి పాల్గొన్నారు.


ఎస్‌.రాయవరంలో..

ఎస్‌.రాయవరం :  సోముదేవుపల్లి రహదారి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు సదరు రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు.  రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవిరాజు,  నాయకులు శానాపతి సూర్యారావు, పోలినాటి నానాజీ,  కోసూరి శ్రీనివాసరావు, రవిరాజు, కృష్ణ, అప్పలరాజు పాల్గొన్నారు.


 కోటవురట్లలో..

కోటవురట్ల : మండలంలో పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ,  జనసేన శ్రేణులు కోటవురట్ల జంక్షన్‌లో రాస్తారోకో జరిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు కనకరాజు, రాష్ట్ర యువ మెర్చా కార్యదర్శి నాగిశెట్టి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. 


నర్సీపట్నంలో..

నర్సీపట్నం : మరమ్మతుకు గురైన చోట కొత్తగా రహదారులు నిర్మించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పెదబొడ్డేల్లి మెయిన్‌ రోడ్డులో ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు కాళ్ళ సుబ్బారావు, ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. 


ములగపూడి వద్ద..

నాతవరం : ములగపూడి వద్ద గల నర్సీపట్నం- తుని  రహదారిలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రహ దారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు లాలం వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు బొడ్డు వెంకటరజనీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేరూరి బుల్లిదొర, పోలుపర్తి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


ఆరిలోవ అటవీ ప్రాంతంలో..

 గొలుగొండ : ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాదె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం సదరు ప్రాం తంలో వంటా- వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రవరం నుంచి పప్పుశెట్టిపాలెం  మధ్యలో గల ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఐదు కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణ జరగక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పలువురు మృత్యువాత పడిన ఘటనలు కూడా ఉన్నట్టు చెప్పారు. ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలని కోరారు. పార్టీ నాయకులు సుర్ల సత్యగిరి శ్రీనివాస్‌, ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.  

అచ్యుతాపురంలో..

అచ్యుతాపురం రూరల్‌ : అచ్యుతాపురం నుంచి గాజువాక వెళ్లే రహదారితో పాటు మండలంలో పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ నాయకులు ఇక్కడ ఆందోళన నిర్వహించారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు, కిసాన్‌మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంతిన భక్తసాయిరాం, రాజాన రామ్మోహన్‌,  షేక్‌ ఇబ్రహీమ్‌ బాషా, పి.రాజబాబు, కాసుబాబు, జోగినాయుడు, శ్రీను, సత్తిబాబు  పాల్గొన్నారు.


రాంబిల్లిలో..

రాంబిల్లి : మండలంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులకు మర మ్మతులు చేపట్టాలంటూ రాంబిల్లి పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.ఎస్‌.వర్మ, కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు ధర్మాల వరహాగోవిందరెడ్డి, మత్స్యకార సెల్‌ జిల్లా నాయకుడు కారే రాముడు, ఉమ్మిడి వెంకటేశ్వర్లు, సూరాడ నూకరాజు, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.

Read more