రహదారులకు మరమ్మతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-06T06:13:28+05:30 IST

అరకులోయ ప్రధాన రహదారి గోతులతో నిండిపోయిందని అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు.

రహదారులకు మరమ్మతులు చేపట్టాలి
అరకులో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు

అరకులోయ, డిసెంబరు 5: అరకులోయ ప్రధాన రహదారి గోతులతో నిండిపోయిందని అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎంపీడీవో కార్యాలయానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. అరకు రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రోడ్ల మరమ్మతులను చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో రాంబాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్‌.రామచంద్రర్‌, మహిళా మోర్చ అధ్యక్షురాలు కమల, పార్టీ ప్రతినిధులు ఆనంద్‌, డొంబునాయుడు, దేవ, సహదేవ్‌ పాల్గొన్నారు.

Read more